వామ్మో.. స్కూల్ బస్సులో కొండచిలువ.. ఎంత పెద్దగా ఉందో?

praveen
ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పాములు వస్తున్న వీడియోలు ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తెగ చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి. అయితే కేవలం జనావాసాల్లోకి దూరడమే కాదు ఏకంగా బస్సులు కార్లు బైకులు అనేవి ఏవి వదలకుండా ఎన్నో రకాల విష సర్పాలు వాహనాల్లోకి కూడా దూరి నక్కి ఉంటూ ఉన్న ఘటనలు అందరిని భయపెడుతున్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఒక భారీ కొండచిలువ స్కూల్ పిల్లలు ప్రయాణించే బస్సులో దూరింది.


 ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలిలో పార్క్ చేసిన ఒక స్కూల్ బస్సులో పెద్ద కొండచిలువ కనిపించింది. ఏకంగా ఒక సీట్ కింద చుట్టుకుని 80 కేజీల బరువున్న పెద్ద కొండచిలువ కనిపించింది. అయితే వెంటనే సమాచారం అందుకున్న సర్కిల్ ఆఫీసర్ వందన సింగ్,  మెజిస్ట్రేటివ్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారూ. ఈ క్రమంలోనే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అని చెప్పాలి.


 కాగా అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు అటు సీటు కింద నక్కి ఉన్నా భారీ కొండచిలువను  ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు అని చెప్పాలి. ఇక ఇలా అటవీశాఖ అధికారులు పట్టుకుంటుండగా ఆ కొండచిలువ పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇక ఈ కొండచిలువ ఏకంగా పదకొండున్నర అడుగుల పొడవు ఉంది అన్న విషయాన్ని అడవి శాఖ అధికారులు నిర్ణయించారు. అది కాకుండా కొండచిలువ బరువు 80 కేజీల వరకు ఉందట. ఇక ఎంతో చాకచక్యంగా  కొండచిలువను పట్టుకున్న వారు ఇక తర్వాత దానిని దౌల్మా అడవిలో వదిలిపెట్టారు.  సండే కావడంతో స్కూల్ బస్సు పార్కింగ్లో ఉండి పోవడం కారణంగా ఇక ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూస్తున్న అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: