వామ్మో.. కొండచిలువ ఎలా ఇంట్లోకి దూరుతుందో చూడండి?
సాధారణంగా పాము కళ్ళ ముందు కనిపించినప్పుడు ఇక ఆ పామును చూసి అందరూ వనికి పోతూ ఉంటారు. కానీ సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు మాత్రం కళ్ళు పెద్దవి చేసి మరి పాము ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పాములు వస్తున్న వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోతున్నాయ్. ఇలాంటివి చూసి ఎంతో మంది జాగ్రత్త పడటం లాంటివి కూడా చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే మెట్ల పక్కన ఉన్న ఒక గోడపై భారీ కొండచిలువ పాకుతూ పైకి వెళ్తూ ఉండడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోని భారత అటవీశాఖాధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. అయితే పైకి వెళ్లడానికి ప్రతిసారి మెట్లు అవసరం లేదు అని ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా జోడించాడు. ఇక 32 సెకండ్ల నిడివి గల ఈ పోస్టు చూసుకుంటే మెట్ల పక్కన ఉన్న గోడ పైనుంచి మెల్లగా పాకుతూ పై అంతస్తులు ఎక్కుతుంది కొండచిలువ. ఇది చూసిన నేటిజన్లో వామ్మో ఇలా కూడా పాములు ఇంట్లోకి వస్తాయా అంటూ కామెంట్ చేస్తున్నారు?