వైరల్ : ట్రైన్ లో గొడవ.. చివరికి బయటకి తోసేశారు?
తాను కూర్చున్న సీట్ పై కాలు పెట్టాడు అనే కారణంతో ఇక సదరూ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు అన్నది తెలుస్తుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే రైలులో ఇంతటి దారుణ ఘటన జరుగుతూ ఉంటే అప్పర్ బెర్తులో ఉన్న మరో ప్రయాణికులు మాత్రం వారిని ఆపకుండా.. అక్కడ ఏదో సినిమాను ప్రదర్శిస్తున్నారు అన్నట్లుగా ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.
ఇక ఒక్కసారి ఈ వీడియోలో చూసుకుంటే ఇక ఇద్దరు ఎదురెదురుగా సీట్లలో కూర్చున్నారు. అయితే యువకుడు నడి వయసు ఉన్న వ్యక్తి కూర్చున్న సీట్ పై కాలు పెట్టాడు. దీంతో అతనితో వాగ్వాదానికి దిగిన సదరు వ్యక్తి మళ్ళీ వచ్చి తన సీట్ లో కూర్చున్నాడు. అయినప్పటికీ తీరు మార్చుకొని యువకుడు మరోసారి అక్కడే వచ్చి కూర్చుని అలాగే కాలు పెట్టాడు. దీంతో విసిగిపోయిన సదురు వ్యక్తి ఆ యువకుడిని ట్రైన్ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేసాడు. ఇక అతను చేసిన పనికి అందరూ ఒక్కసారిగా అవ్వక్కయ్యారు అని చెప్పాలి.కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది..