వైరల్ : సింహానికి క్లాస్ పీకాడు.. అతని ధైర్యానికి అందరూ ఫిదా?
సింహం బలం ముందు ధైర్యం ముందు అడవిలో ఏ ఇతర జంతువు కూడా నిలబడలేదు అని చెప్పాలి. అందుకే సింహాన్ని అడవికి రారాజు అని చెబుతూ ఉంటారు. అయితే సింహాన్ని దూరం నుంచి చూస్తూనే వెన్నులో వెనుకు పడుతుంది. ఇక ఎప్పుడైనా కళ్ళ ముందు పులి సింహం పిల్ల కనిపించిన భయపడిపోతారు. అలాంటిది ఒక భారీ సింహం కనిపిస్తే అది దాడి చేయాల్సిన పనిలేదు అది మన వైపు నడుచుకుంటూ వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పాలి. కానీ కొంతమంది కేర్ టేకర్స్ మాత్రం సింహాలను కూడా అదుపు చేస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారు.
ఇక ఇటీవలే రెండు భారీ సింహాలు ఎంతో చాకచక్యంగా ఒక బక్కపలచని వ్యక్తి అదుపు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు అవాక్ అవుతున్నారు. చైనాలోని ఓ జూలో సింహం పులి ఉంటాయి.. ఇక వాటి ఎన్ క్లోజర్ లోకి ఒక కేర్ టేకర్ వెళ్తాడు. బుక్ పట్టుకొని సింహానికి ఏదో చెబుతూ ఉంటాడు. అయితే కొన్ని సెకండ్ల పాటు ఎంతో ఓపికగా విన్న సింహం ఒకసారిగా అతనిపై దాడి చేస్తుంది. బుక్ కింద పడేస్తుంది. అయినప్పటికీ సదరు వ్యక్తి మాత్రం బయటికి వెళ్లలేదు. కాసేపటికి అతడు ప్యాంటు పట్టుకుని సింహం లాగుతుంది. అయినా తన చేతులతో సింహాన్ని బెదిరిస్తూ కంట్రోల్ చేస్తాడు సదరు వ్యక్తి. ఇది చూసిన ఎంతో మంది అతని ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు.