వైరల్ : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి.. షాకిచ్చిన తిమింగలం?
అయితే మన దేశంలో చాలా తక్కువగా ఇలాంటి అలవాట్లు కొనసాగుతున్నాయి. కానీ అటు విదేశాలలో అయితే ఫిషింగ్ చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పాలి.. సమయం దొరికినప్పుడు గల దగ్గరలో ఉన్న సరస్సుల దగ్గరికి వెళ్లి ఫిషింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు కొంతమందికి చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.
కాస్త కాళీ సమయం దొరకడంతో ఇక తన కొడుకుతో కలిసి సరదాగా చేపలు పట్టేందుకు వెళ్ళాడు ఒక వ్యక్తి. ఇలాంటి సమయంలో ఒక బోటులో వెళ్లిన వ్యక్తికి ఊహించని రీతిలో ఒక పెద్ద తిమింగలం షాక్ ఇచ్చింది ఊహించిన రీతిలో భారీ తిమింగలం వారు ఉన్న బోట్ ని ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. న్యూయార్క్ లో ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. జాక్ పిల్లర్ అనే వ్యక్తి ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తిమింగలం ఒక్కసారిగా నీటి పైకి వచ్చి ఇక తమ బోటు వైపు దూసుకు రావడంతో హఠాత్పరిణామానికి కొడుకు బెంబేలెత్తిగా తండ్రి కూల్ గా ఉన్నాడు.