బైక్ లో దూరిన పాము.. అక్కడికెలా వెళ్ళిందబ్బా?
ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎంతో మంది తమ ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసే ముందు ఇక ఎక్కడైనా పాము ఉందేమో అని ముందుగా చెక్ చేసుకుంటున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా బైక్ స్పీడోమీటర్లోకి నల్లటి త్రాచుపాము దూరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని నర్సింగ్పూర్ లో వెలుగులోకి వచ్చింది. నజీర్ ఖాన్ అనే వ్యక్తి రాత్రి సమయంలో తన బైక్ ను ఇంటి ముందు పార్క్ చేశాడు. తెల్లవారుజామున ఏదో పనిమీద బయటకు వెళ్ళాడు.
కొంత దూరం వెళ్ళగానే బైక్ లో పాము బుస కొడుతున్న శబ్దం వినిపించింది. దీంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే బైక్ పక్కకు ఆపి పరిశీలించగా స్పీడోమీటర్లో నల్లటి నాగుపాము కనిపించింది. ఇక బైక్ లోకి పాము ఎలా వచ్చిందో అర్థం కాక అతను ఒక్కసారిగా కంగుతున్నాడు. ఇక ఏం చేయాలో తెలియక పామును బయటకు తీసే ప్రయత్నం చేసాడు. ఇక కొన్ని గంటల పాటు శ్రమించి అద్దం పగలగొట్టి చివరికి పామును బయటకు తీశాడు అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్ లో చక్కర్లు కొడుతుంది.