వైరల్ : అడవి దున్న కోసం సింహాల గొడవ.. కట్ చేస్తే?
కాగా మరికాసేపట్లో సింహాలు అడవి దున్న ప్రాణం తీసి చివరికి ఆహారంగా మార్చుకుంటాయి అనుకుంటున్న సమయంలో అంతలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏకంగా ఇద్దరు కొట్టుకుంటుంటే మూడో వాడు లాభపడతాడు అన్న విధంగానే ఇక్కడ జరిగింది అని చెప్పాలి. ఏకంగా ఆడ, మగసింహాల మధ్య జరిగిన భీకరమైన పోరులో ప్రాణం కోల్పోవాల్సిన అడవి దున్న సేవ్ అయిపోయింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసిన నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ముందుగా సింహాల గుంపు మొత్తం కూడా ఒక అడవి దున్నను వేటాడాయి . అయితే ఇలా వేటాడి ఆహారం తినే సమయంలో మాత్రం కాస్త స్వార్థపూరితంగా ఆలోచించాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే అడవి దున్నను తినడం మానేసి ఒక సింహం మరో సింహం పై దాడి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ముందుగా ఆడసింహాలు ఒక్కదానిపై ఒకటి దాడి చేసుకోగా.. అంతలో మగసింహాలు కూడా గొడవలోకి ఎంట్రీ ఇచ్చాయ్. ఈ క్రమంలోనే సింహాల గుంపు మధ్య బికరమైన పోరు జరిగింది అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలోనే అప్పటికే సింహాల దాడిలో గాయపడిన అడవి దున్న మాత్రం హాయిగా లేచి అక్కడ నుంచి ఏమీ జరగనట్లు వెళ్లిపోయింది.