రోడ్డుపై దారుణంగా కొట్టుకున్న అమ్మాయిలు?

Purushottham Vinay
ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆటోమాటిక్ గా తరచుగా తగాదాలు ఏర్పడతాయి. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలతో కూడా ఒకరితో ఒకరు చాలా దారుణంగా గొడవ పడుతుంటారు.. చిన్న గొడవ కాస్తా చినికి చినికి గాలివానైనట్లు..చిన్న చిన్న వివాదాలనేవి చాలా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ఇలాంటి పోరాటాలు అనేవి బాగా ప్రాణాంతకంగా కూడా మారతాయి. అయితే ఇలాంటివి ఎక్కువగా గ్రామాల్లో జరుగుతాయి.చిన్న చిన్న విషయాలకే ఒకరితో ఒకరు గొడవపడి బాగా బీభత్సం సృష్టిస్తారు. ఇలాంటి పోరాటాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒకొక్కసారి ఆ వీడియోలు చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. అయితే ఈ వీడియో కూడా చూడటానికి చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో వెళ్లి.. జోక్యం చేసుకుని గొడవను ఆపాలని చూసినందుకు ఓ వ్యక్తి తిరిగి  బాగా తన్నులు తిన్నాడు.


సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిల ఒక విషయంపై గొడవ పడుతున్నారు. అయితే అటు వైపు వెళ్తోన్న వ్యక్తి.. ఆ ఇద్దరి అమ్మాయిల మధ్యకు వెళ్లి.. వారిని విడదీయాలను చూశాడు. ఆ యువతలను ఆపే ప్రయత్నం చేయాలని .. భావించి వెళ్లినందుకు పాపం ఆ యువకుడు దెబ్బలు తిన్నాడు. ఒక అమ్మాయి అయితే ఏకంగా అతడిని నోటితో కొరికింది కూడా.. ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి ఇలా ఒకరితో ఒకరు బాగా గొడవ పడుతుండటం మనం వీడియోలో చూడవచ్చు. ఫస్ట్ వీరి గొడవ బాక్సింగ్ పోటీ జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఫైట్ లో జీన్స్ వేసుకున్న అమ్మాయి ట్రాక్ సూట్ వేసుకున్న అమ్మాయి కంటే కొంచెం పెద్దగా కనిపిస్తోంది. వీరిద్దరి గొడవ మధ్యలో  వెళ్తున్న యువకుడు అయితే గొడవను ఆపడానికి ట్రై చేశాడు. దీంతో ఆ యువకుడిని నేలపై పడుకోబెట్టి, ఒక అమ్మాయి కొట్టడం ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: