జాబ్ అంటే మామూలుగా గంటల తరబడి వర్క్ చెయ్యాలి..వారికి కావలసిన సమాచారం వచ్చే వరకూ పై అధికారులు ప్రెజర్ చేస్తారు..నెలంతా కష్టపడినా చాలి చాలని జీతాలు వస్తున్నాయని చాలా మంది బాధ పడుతున్నారు.అలాంటిది కొన్ని జాబ్ లు జనాలను ఆలోచింపచేస్తున్నాయి..పని తక్కువ పైసలు ఎక్కువ వస్తున్నాయి.తాజాగా మరో జాబ్ జనాలను ఆకట్టుకుంది.. ఆ జాబ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇది జాబె కాదు..ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఫ్రీగా హెలికాఫ్టర్‌లో తిరగొచ్చు కూడా..ఇదేదో ఫేక్ వార్త అని కొట్టిపారేయకండి. సాక్షాత్తు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ నుంచి ఈ విధమైన జాబ్ ఆఫర్ వెలువడడం విశేషం.న్యూజిలాండ్‌లో ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌లలోని సరిహద్దు ప్రాంతా ల్లో బయోడైవర్సిటీ సూపర్‌వైజర్ ఉద్యోగాలకు వారం క్రితం ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు అంతర్జాతీయంగా సరైన అభ్యర్ధుల కోసం అన్వేషిస్తోంది. కొలంబియా నుంచి స్వీడెన్ వరకు ఎంతో మంది ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన వారు న్యూజిలాండ్ సౌత్ ఐలాండ్‌కు చెందిన పశ్చిమ తీరంలో హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తూ అత్యంత అరుదైన పక్షి జాతులను గుర్తించి, వాటి సంరక్షణ చేబడితే చాలు.. ఏడాదికి దాదాపు రూ.42 లక్షల వరకు జీతంగా పొందవచ్చు. అంటే నెలకు రూ.3.5 లక్షల జీతం అన్నమాట. ముఖ్యంగా కివి పక్షులు, పెంగ్విన్లు, బల్లి జాతులను పర్వవేక్షించవల్సి ఉంటుంది.
గత నెలలో న్యూజిలాండ్ కన్జర్వేషన్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ప్రకటనలో ఈ జాబ్‌లకు కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బయోడైవర్సిటీ సూపర్‌వైజర్ పోస్టులకు ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించడంతో దరఖాస్తులు వెల్లువెత్తినట్లు న్యూజిలాండ్ కన్జర్వేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇప్పటివరకు డిపార్ట్‌మెంట్ కు ఫిన్‌లాండ్, రొమేనియా, పరాగ్వే, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి దాదాపు1,400 దరఖాస్తులు వచ్చాయట..ప్రపంచాన్ని చూడాలి అనుకోనేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి..