నిదానమే ప్రధానం.. పెద్దలు చెప్పింది విని రేస్ గెలిచాడు?
ఇంతకీ ఏం జరిగిందంటే... సాధారణంగా స్కూల్ దశలో ఉన్నప్పుడు ఇక టీచర్లు విద్యార్థుల మధ్య ఎన్నో రకాల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో లెమన్ రేస్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఒక స్పూన్ ని నోటిలో పెట్టుకుని ఇక దాని ముందు భాగంలో ఒక నిమ్మకాయను పెట్టుకొని రేస్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలాంటివి నేటి రోజుల్లో స్కూళ్లల్లో కనిపించడం లేదు కానీ ఒకప్పుడు మాత్రం ఎక్కువగా స్కూల్లో విద్యార్థుల మధ్య ఇలాంటి పోటీలు ఉండేవి. ఇక ఇప్పుడు ఇలాంటి పోటీకి సంబంధించిన ఒక వీడియో కాస్త ఆ ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఇక ఈ వీడియోలో చూసుకుంటే లెమన్ రేస్ లో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు రేస్ లో గెలవాలని ఎంతో వేగంగా ముందుకు నడుస్తూ వెళ్లారు. కానీ అందులో ఒక బాలుడు మాత్రం తన పక్కన ఉన్న తోటి విద్యార్థులు లాగా తొందరపడకుండా ఎంతో నెమ్మదిగా స్పూన్ లో ఉన్న నిమ్మకాయను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు కదిలాడు. అయితే అతని కంటే వేగంగా వెళ్ళిన విద్యార్థులు చివరికి నిమ్మకాయను కింద పడిపోవడంతో రేస్ నుంచి తప్పుకున్నారు. అతను మాత్రం అందరూ తప్పకూన్నా కూడా ఎంతో నెమ్మదిగా ముందుకు వెళ్లి ఈ రేసులో విజయం సాధించాడు. ఇది చూసిన నేటిజన్స్ నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.