కోతి పిల్లకు తల్లిగా మారిన పిల్లి.. చూసి నేటిజన్లు ఫిదా?

praveen
నేటి రోజుల్లో మనుషుల మధ్య కుళ్ళు కుతంత్రాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి పైకి నవ్వుతూ మాట్లాడుతున్న లోలోపల మాత్రం పక్కవాడు  నాశనం కావాలనే కోరుకుంటున్నాడు సాటి మనిషి. ఇక పక్కనున్న వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూస్తూ అస్సలు ఓర్వలేకపోతున్నాడు అని చెప్పాలి. ఇలా మనుషులలో మానవత్వం పూర్తిగా కనుమరుగవుతున్న నేటి రోజుల్లో అటు జంతువుల్లో మాత్రం సహాయం చేసే గుణం  పెరిగిపోతుంది. మనుషులు కాదు ఇప్పుడు జంతువులే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ఏకంగా జాతి వైరాన్ని మరిచి మరి కొన్ని జంతువులు స్నేహభావంతో మెలుగుతూ కలిసిమెలిసి జీవించడం లాంటి ఘటనలు కూడా ఇప్పటివరకు చాలానే వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఇక ఇలాంటిది ఏదైనా జరిగిందంటే చాలు ఇక ఆ వీడియో ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు జంతువుల్లో సహాయం చేసే గుణం పెరిగిపోయింది అన్నదానికి నిదర్శనంగా ఒక ఘటన వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒక కోతి పిల్లకు ఒక పిల్లి తల్లిగా మారిపోయింది. అన్ని బాధ్యతలు ఆ పిల్లే చూసుకుంటుంది.


 సాధారణంగా కోతి పిల్లలు తల్లి శరీరాన్ని అంటిపెట్టుకొని ఇక ఎక్కడికి వెళ్లినా కూడా తల్లితోనే వెళుతూ ఉంటాయి. ఇక ఇక్కడ ట్విటర్ వేదిక వైరల్ మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఏకంగా పిల్లి సహనంతో ఆ పిల్ల కోతిని మోసుకెళ్తూ ఉంది. ఏకంగా తల్లి కోతి తన పిల్లలను ఏకంగా శరీరానికి అంటిపెట్టుకొని మోసుకెళ్లినట్లుగానే ఇక ఈ పిల్లి కూడా తల్లిపాత్ర తీసుకొని ఆ పిల్ల కోతికి సహాయం చేస్తుంది. దీంతో ఇక ఈ వీడియో చూసి నేటిజన్లు అందరూ ఫిదా అవుతున్నారు. పిల్లి,  కోతి స్నేహానికి మంత్రముగ్ధులు అవుతున్నారు అని చెప్పాలి. 
ఈ వీడియో చూసిన తర్వాత మనుషుల కంటే జంతువుల బెటర్. జాతి వైరాన్ని మరిచి మరి కల్మషం లేని స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: