అమ్మో మొసళ్ళు.. వణికిపోతున్న జనాలు?
దీంతో ఇక ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగాయి అంటే చాలు స్థానికులందరూ తీవ్ర భయాందోళనకు గురవుతు ఉండటం కూడా జరుగుతున్నాయని చెప్పాలి. కాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయ్ ఇలాంటి వీడియోలు. ఇక ఇప్పుడు ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా మీర్ ఆలం ట్యాంక్ లో ఒక మొసలి ప్రత్యక్షమైంది. పాత బస్తీలో ఉన్న మీరు ఆలం ట్యాంక్ చుట్టూ నెక్లెస్ రోడ్ ను తెరవడంలో జాప్యం కారణంగా మీర్ ఆలం.. పాములు తేళ్లు మొసళ్ళకు నిలయంగా మారిపోయింది.
ఈ క్రమంలోనే ఇటీవల సరస్సు సమీపంలోని రాళ్లపై చిన్న పెద్ద మొసళ్ళ గుంపు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. దీంతో మొసళ్ళు గుంపును చూసి స్థానికులు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు అని చెప్పాలి. ఇటీవల కాలంలో సరస్సు నుంచి తమ ఇళ్లల్లోకి పాములు తేళ్లు వస్తున్నాయని.. ఇక చిన్నపిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి అంటూ స్థానికులు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇలా మీర్ ఆలం సరస్సులో ఉన్న ముసళ్ళను పట్టుకోవడమే కాదు ఇక విష సర్పాల నుంచి తమకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.