మట్టిలో మాణిక్యం.. ఆమె గొంతుకు ఫిదా అవ్వాల్సిందే?
మొన్నటికి మొన్న కచ్చా బాదం అనే పాటతో భువన్ అనే వ్యక్తి ఒక్కసారిగా ఫేమస్ అయ్యి సెలబ్రిటీగా మారిపోయాడు. ఇలా పల్లీలు అమ్ముకునే వ్యక్తి సెలబ్రిటీగా మారాడు అంటే అదంతా సోషల్ మీడియా చలవే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి మట్టిలో మాణిక్యానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక్కడ ఒక మహిళ గాత్రం మాత్రం నెటిజన్స్ అందరిని కూడా మంత్రముగ్ధులను చేస్తుంది అని చెప్పాలి. మహాబలేశ్వరం వీధుల్లో దిగ్గజ సింగర్ అయినా లతా మంగేష్కర్ పాడిన సూపర్ హిట్ సాంగ్ సునో సెజ్నా అనే పాటను పాడుతున్న మహిళకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.
ఇక మొదట ఈ వీడియోని సరదాగానే చూస్తున్న నేటిజన్లు ఇక ఆ తర్వాత ఆ మహిళ గాత్రం వినగానే ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. మట్టిలో మాణిక్యాలు అంటే ఇలాంటి వారేనేమో అని ఎంతో మంది నేటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంత గొప్ప టాలెంట్ ఉన్న సదరు మహిళలను మ్యూజిక్ డైరెక్టర్లు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెబుతున్నారు. సయ్యద్ సల్మాన్ అనే యూజర్ తన ఇంస్టాగ్రామ్ లో ఇక ఈ వీడియోని షేర్ చేశాడు. కాగా మహాబలేశ్వరం లోని పంచ్ గని సమీపంలోని పర్శి వద్ద మహిళ ఇలా తన గాత్రంతో అలరించారు.