పిల్లలతో తస్మాత్ జాగ్రత్త.. షాకింగ్ వీడియో వైరల్?
అయితే ఇలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఏకంగా ఇక బైక్ ఆపరేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇలాంటివి చేస్తే చివరికి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ప్రమాదానికి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక చిన్నారిని స్కూటీ ముందు భాగంలో కూర్చోబెట్టుకుని ఇక వాహనాన్ని ఆపి నిలబడ్డాడు ఒక వ్యక్తి. ఆ సమయంలో హెల్మెట్ కూడా ధరించలేదు. అంతేకాకుండా స్కూటీ ఇంజన్ కూడా ఆఫ్ చేయలేదు అని చెప్పాలి.
ఈ క్రమం లోనే చిన్నారికి తెలియక ఏకంగా స్కూటీ యాక్సిలరేటర్ ని రేస్ చేసింది. దీంతో ఇక స్కూటర్ ఒక్కసారిగా ముందుకు దూసుకు పోయింది అని చెప్పాలి. దీంతో సీట్ పై కూర్చున్న వ్యక్తి ఒక్క సారిగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. ఘటన లో అతని నడుముకు బలమైన గాయం అయింది అని చెప్పాలి. ఇక శ్వాస తీసుకోవడంలో కూడా ఎంతగానో ఇబ్బందులు పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై అతని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇది ఒక నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్ గా మారిపోయింది. వాహనాలపై చిన్నారులను ఎక్కించుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎంతోమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.