పాపం పోలీస్.. మ్యానేజ్ చేయాలనుకున్నా దొరికిపోయాడుగా?

praveen
సాధారణంగా ఎలాంటి ఉద్యోగంలో అయినా కొన్ని కొన్ని సార్లు పైఅధికారులు ఆకస్మిక తనిఖీలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నఫలంగా ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చే అధికారులు అక్కడ ఉన్న ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఇక ఉద్యోగుల పనితీరుకు పరీక్షలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సడన్ షాక్ తో కొన్నిసార్లు ఉద్యోగులు ఇక ఉన్నతాధికారుల ముందు ఏం చేస్తున్నామో కూడా తెలియక.. ఇక ఉన్నతాధికారులు పెట్టిన పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియా వైరల్ గా మారిపోయింది.


 ఇక్కడ ఒక ఉన్నతాధికారి తనిఖీలు చేయడానికి వచ్చిన సమయంలో చివరికి ఒక పోలీస్ అధికారి కాస్త దొరికిపోయాడు. కనీసం ఆ పోలీస్ అధికారికి తుపాకీలో బుల్లెట్ ఎలా లోడ్ చేయాలో కూడా తెలియకపోవడంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. ఇక తనిఖీకి వచ్చిన ఉన్నతాధికారి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ఒక పోలీస్ స్టేషన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది తనిఖీలు చేయడానికి వచ్చిన ఒక ఉన్నతాధికారి అక్కడ ఉన్న సిబ్బంది పనితీరును పరీక్షించటం కోసం కొన్ని పరీక్షలు పెట్టాడు. తుపాకిని లోడ్ చేయగలవా అని ఒక పోలీస్ అధికారిని ప్రశ్నించాడు ఉన్నతాధికారి.


 ఉన్నతాధికారి అలా అడగడంతో ఎందుకు చేయలేను సార్ తప్పకుండా చేస్తాను అంటూ సమాధానం చెప్పాడు పోలీస్. దీంతో ఇక తన ముందుకు వచ్చి తుపాకీ లోడ్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు ఉన్నతాధికారి. దీంతో సదరు సబ్ ఇన్స్పెక్టర్ ఇక తుపాకీని ఎలా లోడ్ చేయాలో తెలియక ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యాడు. ఏకంగా ఫిరంగి మాదిరిగా బుల్లెట్ తుపాకీ ముందు భాగం నుంచి పెట్టడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వు ఆపుకోలేక పోయారు అని చెప్పాలి. అంతేకాదు సదరు ఇన్స్పెక్టర్ పరిస్థితిని చూసిన ఉన్నతాధికారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చివరికి తుపాకీ ని ఎలా లోడ్ చేయాలి అన్న విషయాన్ని వివరించాడు. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో నేటిజన్స్ కూడా నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: