ఘోర ప్రమాదం.. మనుషులను ఎలా తొక్కించాడో చూడండి?
కేవలం మనదేశంలో మాత్రమే కాదండోయ్... అన్ని దేశాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. వాహనదారుల నిర్లక్ష్యానికి అమాయకపు ప్రజలు బలవుతూ ఉన్న ఘటనలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆక్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ తెగ వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోని ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఏకంగా సౌత్ చైనాలోని గ్యాంగ్ జూ ప్రావిన్స్ లో ఈ సిగ్నల్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది అన్నది తెలుస్తుంది. ఎంతో వేగంగా కారులో దూసుకు వచ్చిన ఒక వ్యక్తి ముందు మనుషులు ఉన్నారు అని కూడా చూడకుండా దారుణంగా కారుతో తొక్కించాడు.
బ్లాక్ బీఎండబ్ల్యూ కారులో వచ్చిన ఒక వ్యక్తి వేగంగా దూసుకు వచ్చి రోడ్డు దాటుతున్న మనుషులను ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే ఈ ఘటనలో అక్కడికక్కడే కార్ కిందపడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు అని చెప్పాలి. అదే సమయంలో 13 మంది కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారూ. అయితే ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అయితే ఉద్దేశపూర్వకంగానే సదురు వ్యక్తి ఇక కారుతో జనాలను తొక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.