వైరల్ : పల్టీలు కొట్టిన వ్యాన్.. అంతలోనే ట్విస్ట్?

praveen
ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక ప్రపంచ నలుమూలల్లో జరిగిన ఘటనలు కూడా ఇట్టే తెలిసిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. అతివేగం ప్రమాదకరం అని తెలిసినప్పటికీ ఎంతో మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ చివరికి రోడ్డు ప్రమాదాలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఇలా అతివేగంతో తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటే మరికొన్నిసార్లు అభం శుభం తెలియని వారి ప్రాణాలకు అపాయం కలిగే పరిస్థితిని తీసుకువస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇప్పటివరకు ఎన్నో ఒళ్ళు గగుర్పాటు గురి చేసే ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారగా.. ఇటీవల ట్విట్టర్లో మరో వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఏకంగా సినిమా లో చూపించిన తరహాలోనే ఒక వ్యాన్ గాల్లో ఎగిరి పడింది అని చెప్పాలి. వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఇక ఈ ఘటన జరిగింది. అయితే కారు వెనుక నుంచి ఢీకొట్టుగానే పక్కనే ఉన్న లేన్ లోకి దూసుకెళ్లిన పికప్ వ్యాన్ డివైడర్ను ఢీ కొట్టి రెండు బల్టీలు కొట్టింది.

 ఇక ఆ పికప్ వ్యాను పోలీసులుకారు చేజింగ్ చేసింది. ఈ ఘటన వాషింగ్టన్ లో వెలుగులోకి వచ్చింది. అయితే చేజింగ్ చేస్తున్న పోలీస్ కారు పికప్ వ్యాన్ ను ఢీ కొట్టింది . దీంతో డ్రైవర్  నియంత్రణ కోల్పోయాడు. అది రోడ్డుపై వంకర టింకర్లు తిరుగుతూ పక్కనే ఉన్న మరో రోడ్డులోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే డివైడర్ను ఢీ కొట్టి రెండు ఫల్టీలు కొట్టింది.  అయినప్పటికీ ఆ వ్యాన్ 4 చక్రాలతో సాధారణ స్థితిలో పడిపోయింది. దీంతో ఇక పోలీసులకు దొరక్కూడదు అని భావించిన సదరు వ్యక్తి వాహనాన్ని మళ్లీ వేగంగా నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఇక యాక్సిడెంట్ కు సంబంధించిన ఫుటేజ్ మొత్తం అక్కడ సీసీ కెమెరాలు రికార్డు అయింది. ఇక ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియో చూసి నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: