పదవ తరగతితోనే.. 12 వేల ఉద్యోగాలు..!!

Divya
2023 కొత్త సంవత్సరంలోనే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పలు ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో మల్టీస్ కి స్టాఫ్ హావల్దార్ పోస్ట్లు కలవు. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలయ్యింది.. చివరిగా ఫిబ్రవరి 19వ తేదీన ఈ దరఖాస్తు స్వీకరణ గడు ముగియానుంది. ఈ నేపథ్యంలోనే ఏఏ విభాగాలలో ఖాళీగా ఉన్నాయి దరఖాస్తు చేసుకునేందుకు ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలని విషయాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

మొత్తం ఖాళీల సంఖ్య 12,523 పోస్టులు కలవు ఇందులో MTS పోస్టులు 11,994 కలవు అలాగే హవల్దార్ పోస్టులు 529 పోస్టులు కలవు ఇందు లో ఎన్టీఆర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు కేవలం పదవ తరగతి పాస్ అయితే చాలు.. ఇక వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక హవల్దార్ పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక మిగిలిన వారికి రిజర్వేషన్ పరంగా వారి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది.

ఈ పోస్టులకు అప్లై చేసేందుకు ఆసక్తికరమైన అభ్యర్థులు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు రాత పరీక్ష .. హవల్దార్ పోస్టులకు పిఇటి ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా 270 మార్కులకు నిర్వహిస్తారు  ఇందు లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.. హవల్దార్ పోస్టులకు మాత్రం రాత పరీక్షతోపాటు ఫిజికల్ పరీక్ష కూడా ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు ఫిబ్రవరి 19వ తేదీన చివరి తేదీ. ఇక రాత పరీక్ష మాత్రం ఏప్రిల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ SSC వెబ్సైట్లో పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: