ఈ లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట. అది నమ్మశక్యం కాకపోయినా కొన్ని సార్లు మాత్రం అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇక ఆ కారణంగానే మనం కొన్ని సార్లు నిజమైనవారిని గుర్తించడంలో ఖచ్చితంగా మనం చాలా పొరబడతాము.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి ఫేమస్ సెలబ్రిటిలను పోలిన మనుషులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వచ్చి బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి దేశంలోని పెద్ద అగ్రనేత అయిన నరేంద్ర మోడీ లాగా అనిపిస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ వీడియోలోని వ్యక్తి పానీపూరి అమ్ముతూ మోడీ లాగానే ఫోజులు కూడా ఇస్తున్నాడని వారు కామెంట్లు చేస్తున్నారు.
ఆ వ్యక్తి చూడడానికి అచ్చం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి లాగానే ఉన్నాడని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం నిజానికి అలాంటి పోలికలు ఏం లేవని కూడా అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ దీనికి సంబంధించిన వీడియో, ఇంకా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.ఇక ఈ వీడియోలోని వ్యక్తి కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడే. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా వల్లభ్ విద్యానగర్‌కు చెందిన అనీల్ భాయ్ ఠక్కర్ మాట్లాడుతూ 'ఆయన టీ అమ్ముతాడు.. నేను పానీపూరీ అమ్ముతా'నని సరదాగా అంటున్నాడు. ఇక eatinvadodara అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఠక్కర్ షాపులోని చాలా రకాల పూరీలను మనం ఇందులో చూడవచ్చు. ఇక ఈ వీడియోకు ఇప్పటి దాకా 6 లక్షల 11 వేల లైకులు ఇంకా అలాగే 82 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.ప్రస్తుతం ఇతనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలా మంది కూడా ఈ పిక్ ని షేర్ చేస్తున్నారు.