Viral Video : వాట్ ఎ బౌలింగ్ ? సూపర్ !
ఇక అహ్మదాబాద్‌లో టీం
ఇండియా,
ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో
ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం సాధించింది.
ఇండియా బౌలర్లని చాలా ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్నారు.అయితే మొదటి రోజు ఆటలో మహ్మద్
షమీ తన అద్భుతమైన బంతితో పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను బౌల్డ్ చేశాడు. ఈ టీం
ఇండియా ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాకు చెందిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని తన బంతితో ఒక్క సారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్‌కి గురిచేశాడు. ఇంకా ఈ అద్భుతమైన బంతికి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టాడు.ఆ బంతి వేగానికి వికెట్ చాలా సేపు కూడా గాలిలోనే ఎగురుతూ వెళ్లినట్లు వైరల్ అవుతున్న వీడియోలో మనం చూడొచ్చు. ఈ అద్భుతమైన బంతిని చూసిన
ఆస్ట్రేలియా బ్యాటర్ కూడా ఒక్క సారిగా షాక్ కి గురయ్యి దెబ్బకి అవాక్కయ్యాడు. నెటిజన్లు కూడా ఇలాంటి బంతి చాలా అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మహమ్మద్
షమీ అద్భుతమైన బంతి వీడియోను
బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక
అహ్మదాబాద్ టెస్టు తొలిరోజు హ్యాండ్స్‌కాంబ్‌లానే మహ్మద్
షమీ మార్నస్ లాబుషెన్ స్టంప్‌లను చెదరగొట్టాడు.మహమ్మద్
షమీ ఇన్‌స్వింగ్‌ను మిస్ అవ్వడంతో హ్యాండ్స్‌కాంబ్ వికెట్ కోల్పోయాడు. బాల్ అతని బ్యాట్ లోపలి అంచుని తీసుకొని లెగ్ స్టంప్‌ను పడగొట్టింది.ఇక
ఆస్ట్రేలియా మొదటి రోజు ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించడం జరిగింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో జట్టు ఓపెనింగ్ జోడి మొదటిసారి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని చేసి ఆశ్చర్య పరిచింది.ఇక నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూడండి.ఇంకా ఈ వైరల్ వీడియోని చూసి
నెటిజన్స్ ఫుల్
ఫిదా అయిపోతున్నారు.