మరో 3 రోజులు ఉరుములు మెరుపులతో వాన.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
నిన్నటి రోజు నుంచి ఎక్కువగా వర్షాలు పడుతూ ఉండడంతో ఈరోజు తెల్లవారుజామున కూడా పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో నగరం అంతట ఉరుములు, మెరుపులతో కూడిన వానలు రావడంతో ప్రజలు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాదులో పలు నగరాలలో భారీగా వర్షం పడుతోంది. వర్షంతో రోడ్లన్నీ తడిసి ముద్దవ్వడంతో పలుచోట్ల రోడ్డుపైన నీళ్లు నిలవడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు. గడిచిన కొన్ని నెలల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భారీగా మండుతున్నాయి దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తీవ్రమైన వేడితో జనాలు ఇబ్బంది పడుతున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఎండ తీవ్రత చాలా తగ్గిపోయి కాస్త ఉపశమనం లభిస్తోంది. పలు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఈ మేరకు నిన్నటి రోజున కూడా తెలియజేసింది. నేటి నుంచి 16వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటి రోజున వర్షం అత్యధికంగా నిజామాబాదులో భీమ్గల్లో 7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది అతి తక్కువగా అదిలాబాదులో 2 మిల్లీమీటర్లు నమోదు అయింది.