పెళ్లి మండపంపై WWE మ్యాచ్.. ఎలా కొట్టుకున్నారో చూడండి?

praveen
మీరు డబ్ల్యు డబ్ల్యుఈ పోటీల గురించి వినే ఉంటారు. ఇటీవల కాలంలో ఎంతోమంది ఇలా రెస్లింగ్ పోటీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. డబ్ల్యూడబ్ల్యూఈ లో భాగంగా ఎంతో మంది కండలు వీరులు ఒక స్టేజి మీదకి వచ్చిన తర్వాత దారుణంగా కొట్టుకుంటారు. ఇలా మ్యాచ్ జరుగుతున్న సమయంలో చివరికి ఒక విజేతను నిర్ణయిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో కొట్టుకున్నట్లుగానే ఆ మ్యాచ్ ఏకంగా పెళ్లి మండపం మీద జరిగితే. ఊరుకోండి బాసు పెళ్లి మండపం మీద డబ్ల్యుడబ్ల్యూఈ మ్యాచ్ ఏంటి.. హాయిగా నూతన వధూవరులు నవ్వుతూ  ఫోటోలోకి నవ్వుతో ఫోజు ఇస్తూ ఉంటారు.



 కానీ మండపం మీద డబ్ల్యుడబ్ల్యుఈ పోటీ ఎందుకు జరుగుతుంది. జోక్ కాకపోతే అని అంటారు ఎవరైనా.  కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ కంటే పెళ్లి మండపం మీద జరిగిన గొడవే బాగా రసవత్తరంగా ఉంది అంటూ కామెంట్ చేస్తారు అని చెప్పాలి. ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వాల్సిన నూతన వధూవరులు ఒకరిని ఒకరు చితక్కొట్టుడు కొట్టుకున్నారు. బంధువులు వచ్చి విడదీసేందుకు ప్రయత్నించిన కూడా వారు అస్సలు వినలేదు.


 ఇలా పెళ్లి మండపంపై వధూవరులకు కొట్లాట చూసిన తర్వాత మీకు తప్పకుండా డబ్ల్యుడబ్ల్యుఈ మ్యాచ్ గుర్తుకు వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వధువుకి స్వీట్ తినిపిస్తూ ఉంటాడు వరుడు. కానీ ఆ స్వీట్ తినడానికి వధువు ఇబ్బందిగా ఫీలవుతుంది. అతను మాత్రం అలాగే నోట్లో స్వీట్ పెట్టేందుకు ప్రయత్నించగా.. విసిగిపోయిన వధువు కోపంతో వరుడు చెంప చెల్లుమనిపిస్తుంది. ఇంకేముంది వరుడికి కూడా కోపం నషాలానికంటింది. అతను కూడా ఒకటి ఇచ్చుకున్నాడు. దీంతో ఒకరిపై ఒకరు ఒక రేంజ్ లో దాడి చేసుకున్నారు. అక్కడున్న బంధువులు ఆపాలని ప్రయత్నించినా వారి తరం కాలేదు అని చెప్పాలి. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: