షాపింగ్ మాల్లో కొట్టుకున్న మహిళలు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండరు.. కట్ చేస్తే..!!
చాలా సందర్భాలలో ఏదైనా ఒక వస్తువు కోసం ఆడవాళ్లు గొడవ పడిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు తాజాగా చీరల డిస్కౌంట్ సేల్ కి వెళ్లిన ఇద్దరు మహిళలు ఒకే చీరను ఇష్టపడ్డారు. ఆ చీర తనదంటే తనదంటూ ఇద్దరు మగువలు అందరీ ముందే కుస్తీ పట్టడం జరిగింది. ఇద్దరు మహిళల మధ్య చీర విషయంలో తలెత్తిన గొడవ కాస్త పోటాపోటీగా కొట్టుకునేలా చేసింది. ఈ ఘటన బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
మైసూర్ సిల్క్ సారీ సెంటర్లో ఇటీవలే వార్షికోత్సవం సందర్భంగా డిస్కౌంట్ సేల్ను ప్రకటించారు. భారీ డిస్కౌంట్ లో ఉండడంతో చీరలు కొనేందుకు మగువలు ఎక్కువగా షాపుకు పోటెత్తారు. ఈ సమయంలో ఒక చీరను ఇద్దరు మహిళలు ఇష్టపడడం జరిగిందట.ఆ చీర తనదంటే తనదంటూ ఇద్దరు మహిళలు గొడవపడ్డారట. ఆ తర్వాత సహనం కోల్పోయి దుకాణం లోపల ఇద్దరు జుట్టు పట్టుకొని మరి కొట్లాడుకున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అక్కడ ఉన్న కొంతమంది మహిళలు వీరిని చూసి తెగ నవ్వుతున్నారు. వీరిద్దరూ యుద్ధానికి దిగడంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వీరిని విడిపించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ వినకుండా ఒకరినొకరు కొట్టుకుంటూనే కనిపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది మహిళలు చీరలు కొనుక్కోవడం పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.