మొసలిని అమాంతం మింగేసిన కొండచిలువ.. చివరికి?

praveen
మనిషి జీవితం వేరు అడవుల్లో ఉండే జంతువుల జీవితం వేరు. భూమ్మీద బ్రతికి బట్ట కట్టాలి అంటే అడవుల్లో ఉండే ప్రతి జంతువు కూడా ప్రతి క్షణం  యుద్ధం చేయాల్సిందే. ఒక జంతువు బతకడానికి ప్రాణాలు తీయాల్సి ఉంటే.. మరో జంతువు బతకడానికి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా బలమైన జంతువులు బలహీనమైన జంతువులపై ఆధిపత్యం కోసం ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటాయి అని చెప్పాలి.



 పొట్టోడ్ని పొడుగోడు కొడితే.. పోదుగోడిని పోచమ్మ కొట్టిందట అనే ఒక సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇక అడవుల్లో జంతువుల మధ్య జరిగే యుద్ధం చూస్తే మాత్రం ఈ సామెత బాగా సెట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలు తీసే జంతువులనే చంపితినే మరింత క్రూరమైన జంతువులు మరికొన్ని ఉంటాయి అని చెప్పాలి. ఇలా క్రూరమైన జంతువులు సైతం కొన్ని కొన్ని సార్లు యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇందుకు నిదర్శనం గానే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 అడవుల్లో ఉండే అత్యంత క్రూరమైన జంతువులలో అటు మొసలి కూడా ఒకటి. ఇక దీని నోటికి ఏదైనా ప్రాణి చిక్కింది అంటే అది దాదాపు ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇంతటి భీకరమైన ముసలినే ఓ కొండచిలువ అమాంతం మింగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. అయితే కొండచిలువ ఆ మొసలిని మింగిన తర్వాత డైజేషన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇది గమనించిన అటవీశాఖ అధికారులు ఎంతో చాకచక్యంగా కొండచిలువ కడుపులో ఉన్న ఐదు అడుగుల ముసలిని బయటకు తీశారు. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. అయితే మొసలిని మింగిన కొండచిలువ దానిని జీర్ణించుకోలేకపోవడంతో చివరికి ప్రాణాలు పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: