వైరల్ : తాబేలు దాడి చూస్తే.. వెన్నులో వణుకు పుడుతుంది?
కానీ ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత మాత్రం తాబేలు దాడి చేయదు అని.. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచన మార్చుకుంటారు. ఎందుకంటే ఇటీవలే పాపం తాబేలు అని.. దయచూపి మంచినీరు అందించిన ఒక మహిళపై తాబేలు దాడి చేసిన విధానం మాత్రం ప్రతి ఒక్కరిలో వణుకు పుట్టిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే.. ఒక తాబేలు కంచెకు అవతలి వైపు ఉంది. ఇటు వైపు ఒక మహిళ నిలబడి ఉంది.
అయితే ఆ తాబేలు దాహంతో ఉంది అన్న విషయాన్ని సదరు మహిళ గ్రహించింది. దీంతో తన చేతిలో ఉన్న మంచినీళ్ల బాటిల్ తీసుకుంది. ఇక తాబేలుకు ఆ మంచినీరు అందించడానికి ప్రయత్నించింది. అయితే ఇక మహిళ మంచినీరు పోస్తూ ఉండగా తాబేలు కూడా నోరు తెరిచి మంచినీరు తాగుతూనే ఉంది. అయితే ఇలా మంచినీరు పోస్తున్న సమయంలో తాబేలు ఏకంగా ఒక్కసారిగా మహిళపై అటాక్ చేసింది. ఇక ఈ వీడియో చూస్తున్న వారికి అయితే గుండె జల్లుమనిపించింది అనడంలో అతిశయోక్తి లేదు. తాబేలు అలా అటాక్ చేస్తుందని సదరు మహిళ ఊహించి ఉండదని.. కెమెరా మీదకు ఒక్కసారిగా జంప్ చేసిందని.. ఈ వీడియో చూస్తుంటేనే చాలా భయం వేసిందని ఎంతోమంది నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.