కార్ డోర్ ఓపెన్ చేసిన ఎలుగుబంటి.. అంతలోనే ఏం జరిగిందంటే?

praveen
ఒకప్పుడు మనుషులు జనావాసాల్లో.. జంతువులు అడవుల్లో ఉండేవి. కానీ ఇటీవల కాలంలో మనుషులు పూర్తిగా స్వార్థపూరితంగా మారిపోయారు. దీంతో ఇక జంతువుల ఇల్లు లాంటి అడవిని నరికేసి ఇక భవనాలు నిర్మించుకోవడం చేస్తూ ఉన్నారు. దీంతో ఇక జంతువులు హాయిగా జీవనాన్ని గడిపేందుకు ఇళ్ళే లేకుండా పోయింది. దీంతో ఇక జనావాసాల్లోకి అడవుల్లో ఉండే జంతువులు తరచూ వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి తరహా ఘటనలు సంచలనంగా మారిపోతున్నాయి. అంతేకాదు ఇక ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి.



 అయితే ఇప్పటివరకు చిరుతపులులు సింహాలు లాంటి జంతువులు అటు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. ఇలా జనాభాసాల్లోకి వచ్చిన జంతువులు కొన్ని కొన్ని సార్లు ఇక మనుషులపై దాడి చేసి గాయపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అటు అడవుల్లో ఉండే ఎలుగుబంట్లు మాత్రం చాలా తక్కువగా జనావాసాల్లోకి రావడం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా అమెరికాలో ఇంటి బయట పార్క్ చేసి ఉన్న కారు దగ్గరికి ఒక ఎలుగుబంటి వచ్చింది. అయితే ఇక అది అడవిలోకి వెళ్ళిపోతుందని ఆ కారు యజమానులు అనుకున్నారు.



 అది ఏం చేస్తుందో అని ఇంట్లో నుంచి ఫోన్లో వీడియో తీయడం మొదలుపెట్టారు. అయితే ఎంతో తెలివిగా ఆలోచించిన ఎలుగుబంటి ఏకంగా కార్ డోర్ తీసింది. ఆ తర్వాత ఆ కారులోకి ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే ఎలుగుబంటి కార్ డోర్ తీయగానే భయపడి పోయిన యజమానులు.. గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇక వారి కేకలు విన్న ఎలుగుబంటి భయపడిపోయి ఇక పొదల్లోకి పారిపోయింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఎలుగుబంటి కార్ డోర్ తీయగానే ఇక ఆ ఇంటి యజమానులు ఎంతలా భయపడిపోయారో అన్న విషయం ఇక ఈ వీడియోలో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: