100 వ రోజుకు చేరుకున్న లోకేష్ యువ గళం పాదయాత్ర.. సక్సెస్ అయ్యారా..!!
నిన్నటి రోజున సాయంత్రం వెలుగోడులో ఎస్సీలు బుడగంజగాలు , అక్కడున్న కొంతమంది స్థానికులతో భేటీ అయ్యారు రాత్రికి బోయ రేవుల శివారు వీడిది కేంద్రంలోని నారా లోకేష్ బస చేసి 100వ రోజుల యువ గళం పాదయాత్రను సంఘీభావంగా ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే నారా లోకేష్ పాదయాత్ర పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .కేవలం కొన్ని చానల్స్ మాత్రం నారా లోకేష్ పాదయాత్రను హైలైట్ గా చేస్తున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ పాదయాత్రలో జనం పెద్దగా కనిపించడం లేదని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ 100వ రోజు పాదయాత్ర అని న్యూస్ ఛానల్ వస్తే గాని ప్రజలు పెద్దగా తెలియడం లేదు.
అయినప్పటికీ నారా లోకేష్ మాత్రం తన పాదయాత్రను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలు రకాల కామెంట్ చేయడమే కాకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వం రైతులను, ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటే ఆరోపణలు చేస్తున్నారు. ఆత్మకూరు సమీపం వద్ద పాదయాత్ర ప్రయాణిస్తూ ఉండగా ఎలిఫ్కార్టర్ ప్రమాదంలో అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం మీదగా వెళుతున్న సమయంలో నారా లోకేష్ వైయస్సార్ స్మృతి వనానికి నివాళులు అర్పించారు. ఎందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.