టైటాన్ సబ్ మెర్సిబుల్ లో ప్రయాణించిన 5 గురు బిలీనియర్లు మృతి..!!
అయితే టైటాన్ లో కేవలం 96 గంటలకు సరిపడు ఆక్సిజన్ మాత్రమే నిల్వ ఉంచటంతో అందరూ చాలా ఉత్కంఠంగా ఏం జరుగుతుందో అంటూ ఎదురు చూస్తున్నారు. రెండు రోజుల నుంచి టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించినట్లుగా అమెరికా కోస్ట్ గార్డ్ తెలియజేయడం జరిగింది. అయితే తీవ్రమైన పీడనం వల్ల టైటాన్ సబ్ మెర్సిబుల్ పేలి పోయిందని అందులో ఉన్న ఐదుగురు కూడా మరణించారని..US కోస్ట్ గార్డ్ ప్రకటించడం జరిగింది నిన్నటి రోజున సాయంత్రం రిమోట్ ఆపరేటర్ వెహికల్ సహాయంతో టైటానిక్ నౌకత్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ సమీపంలోని కొన్ని శకలాలను గుర్తించినట్లుగా US కోస్ట్ కార్డు తెలియజేయడం జరిగింది.
టైటానిక్ ఓడ సమీపంలో 48 మీటర్ల దూరంలో ఈ శకలాల ఉన్నట్లుగా గుర్తించారు. పాకిస్తాన్ బిలీనియర్ సేహద్జాద్ దావూద్.. అతని కుమారుడు సులేమాన్.. యూఏ లో ఉండే బ్రిటన్ పారిశ్రామికవేత్త హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నావిక అధికారి ఫాల్.. ఈ యాత్ర నిర్వాహకుడు ఓషన్ గేట్ కంపెనీ వ్యవస్థాపకుడు స్ట్రాక్టర్ రష్. ఇందులో వెళ్లి మరణించారని తెలుస్తోంది. లోతైన సముద్ర యాత్రల కోసం ఈ సబ్ మెర్సిబుల్ ఓషన్ గెట్ ఎక్స్పెడేషన్ అనే ఒక సంస్థ టైటానిక్ శిధిలాల వరకు సబ్ మెర్సిబుల్ వద్దకు తీసుకువెళ్తుంది దాదాపుగా ఎనిమిది రోజులపాటు ఈ పర్యటన కొనసాగుతుంది దీనికోసం మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రెండు కోట్లకు పైగా ఖర్చు అవుతుందట.