రీల్స్ కి బానిసగా మారిన కోతి.. ఏం చేస్తుందో చూడండి?
మరి ముఖ్యంగా నేటి రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా రీల్స్ కి బానిసలుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి గంటల తరబడి రీల్స్ చూస్తూ ఉన్నారు. కొంతమంది రీల్స్ చూడడమే కాదు చేయడం కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదండోయ్ కోతులు కూడా రీల్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయాయి అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో ఉంది. ఏకంగా హాయిగా బెడ్ పై పడుకొని మహారాణిలా ఏకంగా రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది కోతి. ఈ వీడియో చూసి ప్రస్తుతం నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.
ఇక ఇలా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే ఒక కోతి మంచం పై హాయిగా పడుకొని మనుషుల మాదిరిగా రీల్స్ స్క్రోలింగ్ చేస్తూ చేస్తుంది. ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నా.రు అంతేకాదు ఇక ఈ వీడియోని తమకు నచ్చిన వారికి షేర్ చేయడం చేస్తున్నారు. మరి కొంతమంది నేటిజన్స్ ఈ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు. మనుషుల్లాగే కోతులు కూడా రీల్స్ కి ఎడిక్ట్ అయ్యాయని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ కోతి ఎంత దర్జాగా పడుకుని రీల్స్ చూస్తుందో మీరు కూడా చూసేయండి.