చిరుతను తరిమికొట్టిన కొండముచ్చులు.. కొంచెం ఉంటే చంపేసేవే?

praveen
ఐక్యమత్యమే మహాబలం అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఊరుకోండి బాసు ఇప్పుడు మనుషుల మధ్య ఐక్యమత్యం ఎక్కడ ఉంది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా అందరూ జీవితాలు సాగిపోతున్నాయి అంటారు ఎవరైనా. అయితే మనుషుల్లో ఇలాంటి ఐక్యమత్యం లేకపోవచ్చు. కానీ జంతువుల్లో మాత్రం ఇంకా ఐక్యమత్యం ఉంది అని నిరూపించే ఘటనలు వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఏకంగా భయంకరంగా వేటాడే జంతువులను సైతం సాధు జంతువులు ఐకమత్యంతో ఉండి ఎదురు తిరిగి భయపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఐక్యమత్యంగా ఉంటే ఎంతటి ప్రమాదాన్ని అయినా తరిమి కొట్టవచ్చు అని నిరూపించే మరొ ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అడవుల్లో ఉండే అతి ప్రమాదకరమైన జంతువులలో చిరుత పులి కూడా ఒకటి అని చెప్పాలి. చిరుత పులికి బలం దాని వేగమే. అన్ని జంతువుల కంటే వేగంగా వేటాడటం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సాధు జంతువులు ఇలాంటి చిరుత పులి భారీ నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు దాని వేగం ముందు ఏమి చేయలేక ప్రాణాలను వదులుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏకంగా కొండముచ్చు పై దాడి చేసింది చిరుత.కానీ ఆ చిరుతనే పరిగెత్తించాయి మిగతా కొండముచ్చులు.



 దక్షిణాఫ్రికాలోని ఒక మారుమూల ప్రాంతంలో సుమారు 50 కొండముచ్చుల గుంపు రోడ్డుపై వెళ్తుంది. అదే సమయంలో ఒక చిరుతపులి ఆహారం కోసం రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చింది. కొండముచ్చులు కనిపించడంతో ఇక వాటిపై దూసుకుని వచ్చింది చిరుత. ఒక కొండముచ్చును పట్టుకొని వేటాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆ గుంపు మొత్తం ఆ చిరుతతో పోరాటానికి దిగాయి. భయంతో పరిగెత్తకుండా మూకుమ్మడిగా చిరుతపై ఎదురుదాడికి దిగాయి ఆ కొండముచ్చులు. చాలాసేపు అది కొండముచ్చులతో పోరాడిన ఇక వాటి దాడిని తట్టుకోలేక చివరికి వేటను విరమించుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: