వార్నీ.. ఆ మహిళ పామును ఎంత ఈజీగా పట్టుకుందో చూడండి?
అయితే నేరుగా పాములను చూడడానికి భయపడే జనాలు.. అటు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే పాములకు సంబంధించిన వీడియోలను చూడడానికి మాత్రం తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పాముల కదలికలు ఎలా ఉంటాయి.. అవి ఎంత వేగంగా దాడి చేస్తాయి అనే విషయాలపై కూడా అవగాహన పెంచుకుంటూ ఉంటారు. దీంతో ఎన్నో పాము వీడియోలు వైరల్ గా మారిపోతాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. సాతారణంగా మగవాళ్లే పామును చూస్తే వనికి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా ఎంతో చాకచక్యంగా భారీ పాములు పట్టుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాళి. అయితే ఇక ఈ వీడియోలో ఆ యువతి పామును పట్టుకున్న విధానం చూస్తే మాత్రం గూస్బంస్ రావడం ఖాయం అని చెప్పాలి. దాదాపు ఆ పాము ఏడు అడుగుల వరకు ఉంటుంది. కొద్ది కొద్దిగా ఇంటి రూఫ్ నుంచి బయటకు వస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆ యువతి చేతిని కూడా చుట్టుకుంది. సాదరణంగా కొంతమంది పాములు పట్టుకోవడానికి ఏదైనా కర్ర సహాయం తీసుకుంటూ ఉంటారు. కానీ యువతి మాత్రం ఎలాంటి సహాయం తీసుకోకుండా అలవోకగా పామును పట్టేసుకుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.