నీ గుండె ధైర్యం ఏంటి గురూ.. పులికి లిప్ లాక్ ఇచ్చాడు?
ఎంతోమంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఇక ఇలాంటి ప్రమాదకరమైన జంతువులకు దగ్గరగా వెళ్లి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇక ఇంటర్నెట్ జనాలు వాటిని ఎంతో ఇంట్రెస్ట్ గా వీక్షించడం చేస్తూ ఉంటారు. అయితే ఇక దగ్గరగా వెళ్లి ఫోటోలు వీడియోలు అయితే తీస్తారు. కానీ వాటితో ఆటలు ఆడటానికి ధైర్యం మాత్రం చేయరు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా అత్యంత ప్రమాదకరమైన పులితోనే ఆటలు ఆడటం మొదలుపెట్టాడు. ఏకంగా పులికి లిప్ కిస్ ఇచ్చాడు ఇక్కడ ఒక వ్యక్తి.
ఎందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇది చూసి నెటిజన్స్ అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే అతను ఆ పులికి లిప్ కిస్ ఇస్తుంటే.. ఆ పులి అతనిపై దాడి చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది. అయితే లిప్ కిస్ ఇవ్వడమే కాదు ఆ పులితో రొమాన్స్ కూడా చేశాడు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత అది పెంపుడు పులి అని తెలుస్తుంది. పెంపుడు పులి అయితే ఏంటి అది కూడా ప్రమాదకరమే కదా అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.