హెల్ప్ చేసిన వ్యక్తికి.. చిరుత ఎలా థాంక్స్ చెప్పిందో చూడండి?

praveen
అడవుల్లో ఉండే క్రూర మృగాల పేరు వింటే చాలు అందరిలో భయం పుడుతూ ఉంటుంది. ఎందుకంటే క్రూర మృగాలు ఎంతో దారుణంగా భయంకరంగా వేటాడుతాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనె ఇలాంటి వీడియోలు చూసి ఇక అడవుల్లో ఉండే జంతువుల విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇక అడవుల్లో ఉండే పులులు సింహాలు ఎంత ప్రమాదకరమైనయో అత్యంత వేగంగా జంతువులను వేటాడే చిరుతలు  కూడా అంతే ప్రమాదకరమైనవి.


 అయితే పులి, సింహంతో పోల్చి చూస్తే చిరుతకు కాస్త బలం తక్కువగా ఉన్నప్పటికీ.. చిరుత వేగమే దాని ప్రధాన బలం అని చెప్పాలి. అయితే ఇలాంటి క్రూర మృగాలు వేటాడే తీరు చూస్తే వీటికి జాలీ దయ గుణం అనేది ఉండదు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ ఇలా జంతువులను చంపితినే క్రూర మృగాలకు సైతం ఏకంగా సహాయం చేసిన వారికి కృతజ్ఞత తెలిపే ఒక మంచి గుణం ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. తనకు హెల్ప్ చేసిన ఒక యువకుడి పట్ల చిరుత కృతజ్ఞతా భావాన్ని చూపించింది.


 నమిబియాలోని రిజర్వులో ఈ ఘటన వెలుగు చూసింది. చిరుతను సదర్ ఫోటోగ్రాఫర్ గుర్తించాడు. ఎండ వేడి కారణంగా అలసిపోయి కిందపడిపోయింది చిరుత. అంతే కాదు ఆ చిరుతకు అనేక గాయాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ మనసు చలించిపోయింది. అది ప్రమాదకరమైన చిరుత.. దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో అని ఆలోచించకుండా.. ఆ చిరుతకు నీళ్లు తాగించాడు. ఆ తర్వాత రెస్క్యూ స్టేషన్కు తీసుకువెళ్లి ఇక చికిత్స అందించాడు. ఇలా చికిత్స చేసిన వ్యక్తి పట్ల ఆ చిరుత కృతజ్ఞత తెలిపింది. తిరిగి అడవిలోకి వదిలేసిన తర్వాత మళ్లీ ఆ యువకుడు దగ్గరికి వచ్చి హత్తుకుంటుంది చిరుత. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: