వైరల్ : అన్నయ్యకు రాఖీ కట్టి.. ఏం తినిపించిందో చూస్తే నోరేళ్ళ పెడతారు?
ఇలాంటి వీడియోలతో సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఒక చెల్లి తన అన్నయ్యకు ఎంతో ప్రేమగా రాఖీ కట్టింది. ఈ వీడియో చూసి నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. రాఖీ కట్టడంలో కొత్త ఏముంది.. ఏ చెల్లి అయిన ఇలాగే అన్నయ్యకు రాఖీ కడుతుంది కదా అని అనుకుంటున్నారు కదా.. అయితే సాధారణంగా చెల్లి అన్నయ్యకు రాఖీ కట్టిన సమయంలో నోరు తీపి చేయడానికి ఏదైనా స్వీట్ తినిపించడం చేస్తూ ఉంటుంది. ఇలాంటిది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయం.
కానీ ఇక్కడ ఒక చెల్లెమ్మ తన అన్నయ్యకు రాఖీ కట్టిన సమయంలో తినిపించింది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏకంగా స్వీట్ తినిపించడం కాదు తన అన్నయ్యకు అలవాటు ఉన్న గుట్కాను తన చేతితో అన్నయ్యకు తినిపించింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారిపోయింది. అయితే ఇది విని మీరు కూడా కంగుతూనే ఉంటారు కదా. నేటిజన్స్ కూడా ఇలాగే షాక్ అవుతున్నారు. అయితే అన్న ఇష్టాన్ని అర్థం చేసుకున్న ఎంత గొప్ప చెల్లెలివి అని కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తుంటే.. ఇంకొంతమంది అన్నయ్య ఆరోగ్యాన్ని చెల్లలే పాడు చేస్తుందని తిట్టిపోస్తున్నారు.