సూపర్ ఐడియా బాసూ.. సిలిండర్ను ఈజీగా మోయొచ్చు?

praveen
మనసుపెట్టి ఆలోచించాలి కానీ ప్రతి సమస్యకు ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇక సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. సమస్య ఏదైనా సరే ఇక ఆలోచన చేస్తే పరిష్కారం తప్పక లభిస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన మారిపోయింది. ఇటీవల కాలంలో సామాన్యుల నుంచి సంపన్నులు  వరకు ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ వినియోగం చేస్తూ ఉన్నారు. అయితే గ్యాస్ పై వంటలు వండుకునేటప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతుందో.. అప్పుడు కొత్త గ్యాస్ సిలిండర్ను మోసుకు రావడం మాత్రం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే  ఇంటి పక్కనే రోడ్డు లేనప్పుడు.. ఇక దూరం నుంచి గ్యాస్ సిలిండర్ ని భుజాలపై మోసుకు రావాల్సి వచ్చినప్పుడు.. కొంతమంది అసహనానికి గురవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇక్కడ ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్ మోయటం విషయంలో  ఒక వినూత్నమైన ఆలోచన చేసి.. ఇక ఇప్పుడు ఎలాంటి భారం పడకుండానే ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. దీంతో ఎంతో సులభంగా ఇక గ్యాస్ సిలిండర్ను మోయడం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

Your browser does not support HTML5 video. అయితే ఇక ఇతను ఆలోచించిన పరిష్కారం చూస్తే ఇకనుంచి కేవలం యువకులు మాత్రమే కాదు ముసలి వాళ్లు సైతం ఎంతో ఈజీగా ఇక గ్యాస్ సిలిండర్ లను ఒకచోట నుంచి మరొక చోటికి తీసుకు వెళ్ళగలరు అని చెప్పాలి. ఇక అతని మనసులో తట్టిన ఆలోచనకు రూపం ఇవ్వడంతో ఇది చూసి ఇంటర్నెట్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సింపుల్ పరికరం జనాలను ఫిదా చేస్తుంది అని చెప్పాలి. రెండు ఇనుప రాడ్లు.. రెండు చక్రాలు.. ఒక కొక్కేమ్ తో ఇది తయారైంది. గ్యాస్ సిలిండర్ ని ఈజీగా మోసుకు వెళ్లేందుకు వీలుగా ఈ పరికరాన్ని తయారు చేశాడు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: