పారా గ్లైడింగే రిస్క్ అనుకుంటే.. ఇతను గాల్లోనే ఏం చేశాడో చూడండి?

praveen
ఇటీవల కాలంలో జనాలు అందరూ సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇంటర్నెట్లో ఫాలోవర్లను  సంపాదించుకోవడానికి కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఏకంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మరి ఎంతో ప్రమాదకరమైన విన్యాసాలను చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక ఇలాంటి విన్యాసాలు చేసి అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు.

 కొంతమంది జనాలు అయితే ఏకంగా విన్యాసాలు చేయడంలో కూడా క్రియేటివిటీ చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కొంతమంది ప్యారా గ్లైడింగ్ చేస్తూ ఉంటే ఇంకొంతమంది వివిధ రకాలుగా సాహస క్రీడల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కాస్తయినా భయం బెరుకు లేకుండా ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు.  అయితే ఈ వీడియోలు చూసినప్పుడు ఏకంగా నేటిజన్స్ కే భయం వేస్తూ ఉంటుంది. కానీ చేసేవారు మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 సాదరణంగా పారా గ్లైడింగ్ చేయడమే ఒక సాహసం అయితే.. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం పారా గ్లైడింగ్ చేస్తూ ఏకంగా టిఫిన్ చేసేసాడు  తన దగ్గర ఉన్న ఒక గిన్నె బయటకు తీసాడు  తర్వాత అందులో తృణధాన్యాల ప్యాకెట్ వేశాడు. చివరికి అతను అరటిపండును కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చిన్న బాటిల్ పాలను తీసి ఇక ఆ బౌల్లో పోస్తాడు. అయిన తర్వాత ఇక వాటిని బాగా కలిపి ఎంతో ఉత్సాహంతో కడుపు నింపుకుంటాడు. తర్వాత కెమెరా అతను నేలపై దిగినట్లు చూపిస్తుంది. అయితే ఈ దృశ్యాలు చూసిన వారంతా భయపడుతూ ఉంటే.. అతను మాత్రం నవ్వుతూ ఇదంతా చేస్తూ ఉండడం వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడవచ్చు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: