కరోనా: లాంగ్ కోవిడ్ బారిన పడ్డ వారికి ప్రమాదమేనా..?
పురుషులు, మహిళలు ,చిన్నపిల్లలు అని తేడా లేకుండా అన్ని వయసులో వారికి ఇది చాలా సమానంగా కనిపించినట్లు అధ్యయనంలో తెలియజేశారు. కరోనా తో రెండు నెలలు అంతకుమించి హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వారిలో ఈ సమస్యలు లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుపుతున్నారు. ఇందుకోసం పలు దేశాలలో ఉండే 65 వేల మంది పెద్దవారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఏప్రిల్-2020 నుంచి 2022 ఆగస్టు మధ్య పలు రకాల కోవిడ్ శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట. కోవిడ్ టీకాలు వేసుకున్న వారే ఇందులో 22,000 మందికిపైగా కరోనా కాలంలో విపరీతమైన వ్యాధితో ఇబ్బంది పడ్డారట.
65 వేల మందిలో 10% వారం ఒక వారం పాటు..అంతకంటే ఎక్కువ రోజులు కరోనా కారణంగా మంచానికి పరిమితమై ఉన్నారట. ఇలా మంచాన పడ్డ వారిలో ఇతరులతో పోలిస్తే 37% ఎక్కువగా కోవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది ..వీరికి శ్వాస ఆడక పోవడం, చాతిలో నొప్పి ,తల తిప్పడం, విపరీతమైన తలనొప్పి వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారట. మంచాన పడ్డ వారితో పోలిస్తే ఇలాంటి లక్షణాలు ఇతర వాటిలో ఎక్కువగా కనిపించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగింది. కరోనా లాంగ్ కోవిడ్ అంటే కరోనా సోకిన మూడు నెలల తర్వాత అందుకు లక్షణాలు మళ్లీ తిరిగి కనీసం రెండు నెలలు అంతకుమించి కొనసాగితే లాంగ్ కోవిడని తెలుపుతున్నారు.