సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో మనుషులు చేసే వివిధ పనులు నెటిజన్లను ఆకట్టుకునేలా ఇంకా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇక పెంపుడు జంతువులు, అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా చాలా వైరల్ అవుతుంటాయి.తాజాగా ఓ వీడియో కూడా బాగా వైరల్ అవుతూ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ పిల్లవాడు ఆడుకుంటున్న బొమ్మలు.. కాదు.. జంతువులను చూస్తే మీకు ఖచ్చితంగా భయంతో వణుకు పుట్టాల్సిందే.. ఇక ఈ వీడియో అక్టోబర్ 15న @nouman.hassan1 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. పిల్లలంటే బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటారు. లేదంటే ఇతర ఆట వస్తువులతో వారు ఆడుకుంటారు. కానీ, వీడేంట్ర బాబు.. భయంకర క్రూర జంతువులతో ఆడుకుంటున్నాడు.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.
మనందరికీ కూడా ఖచ్చితంగా ఏదో భయం తప్పనిసరిగా ఎదురై ఉంటుంది..ఇక పాము అని చెప్పగానే చాలా మంది ఖచ్చితంగా భయాందోళన చెందడం మనం చూశాం. అలాంటిది ఏకంగా కొండచిలువ వంటి పాము కనిపిస్తే.. ఇక అంతే.. అక్కడ్నుంచి జెట్ స్పీడులో ఉరుకులు, పరుగులు తీయాల్సిందే.. అయితే తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఓ బాలుడు అసలు కొంచెం కూడా భయం లేకుండా కొండచిలువ, మొసలి పిల్లతో చాలా క్యాజువల్‌గా ఆడుకుంటున్నాడు.ఇక ఈ వీడియోను చాలా మంది ఆశ్చర్యంతో చూస్తున్నారు.@nouman.hassan1 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఈ వీడియో షేర్ చేయబడింది. కాస్త భిన్నంగా ఉంటే ఏ వీడియో అయినా నెట్టింటా వైరల్ అవుతుంది. అలాంటి వీడియోల్లో ఈ వీడియో కూడా ఒకటి . ఈ వీడియోకి ఇప్పటి వరకు 33,000 పైగా వీక్షణలు వచ్చాయి. ఇక ఈ వీడియోలో కేవలం కొండ చిలువ, మొసలి కాకుండా, ఒక పులి కూడా బాలుడి వెనుక సైలెంట్‌గా కూర్చుని ఉండటం కనిపించింది.