ఏమైనా పండుగలు వచ్చినా లేదా ఏమైనా ఫంక్షన్లు జరుపుకోవాలన్నా చాలా మందికి కూడా ముందుగా గుర్తుకొచ్చే వంటకం పన్నీర్ కర్రీ. ఈ కర్రిని బిర్యానీలతోనూ, చపాతీలతోనూ ఇంకా నాన్‌లతోనూ తినడాన్ని చాలా మంది ఎంతగానో ఇష్టపడతారు.ముఖ్యంగా వెజిటేరియన్స్ పనీర్ ని తినడానికి చాలా ఇష్టపడతారు.మన ఇండియాలో పన్నీర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో చూస్తే పన్నీర్‌పై మీకు ఉన్న ఇష్టం తగ్గి యాక్ అనిపించి దాని జోలికి వెళ్ళరు.ఆ ఫొటో చూసి చాలా మంది కూడా ఒక రేంజ్ లో షాక్ అవుతున్నారు. Azhar Jafri అనే X ( ట్విట్టర్ కొత్త పేరు ) యూజర్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ వ్యక్తి నీలిరంగు లుంగీ ధరించి ఏకంగా జున్ను ముక్కలపై పీట వేసుకుని కూర్చున్నాడు. ఆ జున్నును తెల్లటి వస్త్రంలో వేసి నీటిని మొత్తాన్ని పిండేందుకు ఆ వ్యక్తి అలా కూర్చున్నాడు.
ఆ చుట్టూ పరిసరాలన్నీ కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ ఫొటో షేర్ చేసిన వ్యక్తి ``దయచేసి నాన్-బ్రాండెడ్ పన్నీర్‌ను కొనకండి`` అస్సలు అని కామెంట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.ఈ ఫొటోను ఇప్పటి దాకా మొత్తం 60 వేల మందికి పైగా వీక్షించారు. ఈ ఫొటో చూసిన చాలా మంది పన్నీర్ తయారీ ప్రక్రియ గురించి ఎంతగానో ఆందోళన వ్యక్తం చేశారు. ``ఓ మైగాడ్ అసలు పన్నీర్‌ను ఇలా కూడా తయారు చేస్తారా``, ``బ్రాండెడ్ పన్నీర్ కూడా పరిశుభ్రంగా ఉంటుందని ఎలా చెప్పగలం``, ``బ్రాండెడ్ పన్నీర్ తయారు చేసేటపుడు సూటు ధరించిన వ్యక్తి దానిమీద కూర్చుంటాడేమో`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.కొంతమంది నెటిజన్స్ అయితే ఈ ఫోటో చూసి కోపంతో రగిలిపోతున్నారు.పనీర్ కొనేటప్పుడు ఇలా చేస్తారని తెలుసుకొని కొనండి అని కొంతమంది ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.