ప్రజలను ఒనికిస్తున్న కొత్త వైరస్.. సింటమ్స్ ఇవే..!!
2019 లో ప్రపంచ మొత్తాన్ని సైతం కరోనా అతలాకుతలం చేసింది. ప్రపంచమంతా ఈ వైరస్ దెబ్బకి ఇళ్లకే పరిమితం అయిపోయారు. ముఖ్యంగా జీవనం సాగడం కూడా చాలా కష్టంగా మారిపోయేది. గతంలో కూడా ఇండియాలో కేరళలో నిపా వైరస్ కూడా అందరిని గడగడలాడించింది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో ఒక కొత్త వైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ కేరళ రాష్ట్రాన్ని కూడా ఆనుకొని ఉన్న తమిళనాడులో కూడా కనిపిస్తోందట. అయితే కోవిడ్ పేరు విని అక్కడ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారట. ఎక్కడ చూసినా మళ్లీ ఆంక్షలు మాస్కులు లేకుండా బయటికి తిరగలేని పరిస్థితి ఏర్పడుతోందట.
గతంలో కూడా ఎన్నో భయాందోళనలు మనం చూసే ఉన్నాము.. ఇలాంటి వాతావరణం నుంచి బయటపడి కొన్ని నెలలుగా కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ దేశంలో ఒక వైరస్ బయోపెట్టేలా చేస్తోంది. తాజాగా తమిళనాడులో ఒక కొత్త వైరస్ బయటపడినట్లుగా సమాచారం. ఈ వైరస్ ప్రస్తుతం ఫ్లూ వైరస్ గా పిలుస్తూ ఉన్నారు.. వేగంగా విజృంభిస్తున్న ఈ వైరస్ ప్రభావం ప్రజలలో ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో ప్రజలు ఆసుపత్రి కి పరుగులు తీస్తూ ఉన్నారు.
దీంతో అక్కడ ప్రభుత్వం అప్రమత్తమయి పలు రకాల ఆంక్షలు కూడా విధించిందట. ముఖ్యంగా పలు రకాల జిల్లాలో అలెర్ట్ జారి కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫ్లూ వైరస్ వచ్చిందని గుర్తించడానికి లక్షణాలు ఏమిటంటే.. ముందుగా జ్వరం వస్తుందని ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయని ఈ రెండు లక్షణాలు టైఫాయిడ్ మరేరియా వంటి జ్వరానికి వచ్చే లాగా ఉంటాయని వైద్యుల సాహిత్యం తెలియజేస్తున్నారు. అయితే ముఖ్యంగా ముక్కులో నుంచి నీరు కారడం, తలనొప్పి ఎక్కువగా రావడం ఈ ఫ్లూ వైరస్ లక్షణాలుగా గుర్తించారు వైద్యులు. అయితే ఇవి ఎక్కువగా వృద్ధులలో చిన్నపిల్లలలో మాత్రమే ప్రభావం చూపిస్తోందని వైద్యులు తెలియజేస్తున్నారు.