మనుషుల స్వార్థం వల్ల ప్రకృతిలోని చాలా జీవులు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. నేల, నింగి, నీరు ఇలా ప్రతి చోటా కూడా చాలా జీవులు అంతరించిపోతున్నాయి.అందుకే అప్పుడప్పుడు ఎక్కడైనా వింత జీవి కనిపిస్తే చాలు మనం ఎంతగానో ఆశ్చర్య పోతాం.ఇంకా అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను ఇతరులతో షేర్ దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తాం.. అదే సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఆ జీవిగురించి పరిశోధిస్తారు. దాని గురించి బాగా తెలుసుకోవడం మొదలుపెడతారు. ప్రస్తుతం భూమి మీద ఉన్న ఓ వింత జీవి గురించి ప్రజల్లో చర్చనీయాంశమైంది. 42 సంవత్సరాల క్రితం కనుమరుగైన ఈ జీవి మళ్ళీ కనిపించింది. ఈ జీవిని చివరిసారిగా 1981 వ సంవత్సరంలో చూసినట్లు చెబుతున్నారు.ఈ వింత జీవిని ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ మ్యూజియం పరిశోధకులు ఇంకా జేమ్స్ కుక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా కనుగొన్నారు. ఇక ఈ అరుదైన సరీసృపాన్ని లియోన్స్ గ్రాస్‌ల్యాండ్ స్ట్రిప్డ్ స్కింక్ అని అంటారు. అయితే ఈ వింత జీవి ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది.ఇంగ్లిష్ వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ జీవి ఒక పాములాంటి బల్లి. ఆస్ట్రేలియాలోని కైర్న్స్ సిటీకి దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ సర్‌ప్రైజ్ సమీపంలో 5 చదరపు కిలోమీటర్ల క్షేత్రంలో కనుగొన్నారు.కేవలం ఈ బల్లి మాత్రమే కాదు మరో రెండు అరుదైన బల్లులని కూడా కనుగొన్నారు.
ఇక ఈ జీవులను చూసిన డాక్టర్ ఆండ్రూ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ బల్లులు అంతరించిపోయే దశలో ఉన్నాయని ..ఇవి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయని ఈ బల్లులు దొరకడం చాలా కష్టమని కూడా చెప్పారు. ఆశ్చర్యకరంగా అరుదైన ఈ బల్లులు కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి. ఈ మూడింటిని ఈ విధంగా చూడటం నిజంగా ఒక ఉత్తేజకరమైన క్షణమని పరిశోధకులు తెలిపారు. తమ ఆనందాన్ని అసలు మాటల్లో వర్ణించలేమని చెబుతున్నారు. మట్టిలో ఈత కొట్టడానికి వీలుగా తమ అవయవాలను అవి మార్చుకుంటాయి. ఇంకా అంతేకాదు వీటి శరీర నిర్మాణం ఇసుక నేలలకు అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు.ఈ బల్లుల అంతరించుపోవడానికి కారణం ఎక్కువగా మానవ తప్పిదాలే అని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఇక్కడి అడవులలో చాలాసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయని.. అందుకే అరుదైన ఈ బల్లుల జనాభా తగ్గిందని పరిశోధకులు చెప్పారు. ఇంకా ఇది కాకుండా కరువు కారణంగా చాలా చోట్ల అంతరించిపోయింది. ఇది ఇటీవల క్వీన్స్‌లాండ్ ఇంకా ఆస్ట్రేలియన్ ప్రభుత్వాలు అత్యంత ప్రమాదంలో ఉన్న.. అంతరించి పోతున్న జీవుల జాబితాలో చేర్చడం జరిగింది.