ముఖేష్ అంబానీ ఇంట మరో సూపర్ కారు .. ధర ఎంతంటే..?
ముఖేష్ అంబానీ తీసుకున్నటువంటి కొత్త కారు పేరు ఫెరారీ కంపెనీకి సంబంధించింది.. దీని ధర 4.5 కోట్లు ఉన్నట్లు సమాచారం. కారు రంగు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ కార్ను చూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.. అంతేకాకుండా దీని డిజైన్ లేటెస్ట్ మోడల్ అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నది. ఖరీదైన కార్లు అంబానీ గ్యారేజీలో చాలా ఉన్నాయి.ఇప్పుడు లెక్కకు మించిన ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు ముఖేష్ అంబానీ.
అంబానీ ఫ్యామిలీ సభ్యుల కాన్వాయ్ లో మెర్సిడెస్ AMGG-63లు రేంజ్ రోవర్ SVUలు ,రోల్స్ రాయిస్ ఇతరత్రా ఖరీదైన ఎన్నో కార్లు ఉన్నాయి. ముఖేష్ అంబానీ దగ్గర కొన్ని వందల కోట్లు రూపాయల విలువ చేసే కార్లు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కొన్న ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్ టర్బోచార్జ్ V-8 ఇంజన్ కలిగి ఉంటుందట.690 PS తో పాటు పవర్ 760 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ కారు 2021లో ప్రారంభమైన ఈ కారు మొదట నుంచి ఎంతోమంది సెలబ్రిటీలను ఆకట్టుకోవడం జరుగుతోంది .పలువురు ప్రముఖులు ఇప్పటికే ఈ కార్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు తాజాగా ముకేశ్ అంబానీ అంట కూడా ఇలాంటి స్టైలిష్ కార్ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.