తెలంగాణలో ఫ్రీ బస్సు ప్రయాణం.. ఇలా చేయకపోతే 500 కట్టాల్సిందే..!!
కానీ ఆధార్ తీసుకొని మహిళలు కండక్టర్లకు చూపించి టికెట్ తీసుకోవడం తప్పనిసరి..కర్ణాటక ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది.. అక్కడ మహిళలు ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కిన తరువాత దానిపై ఉన్న నెంబర్ ప్రకారం ఆ బస్ కండక్టర్ నమోదు చేసుకొని టికెట్ ఇవ్వడం జరుగుతుందట.. అయితే ఆ టికెట్టును పారవేయకుండా దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే.. ఎక్కడైనా టికెట్ చెకింగ్ ఆఫీసర్లు బస్సు ఆపి చెక్ చేసినప్పుడు ఫైన్ వేయకుండా టికెట్లు చూపిస్తే సరిపోతుంది..ఒకవేళ టికెట్ లేకపోతే 500 ఫైన్ కట్టాల్సిందే మహిళలు టికెట్ ఉన్న వారి దగ్గర ఈ ఫైన్ ఉండదు.
ఇదే పద్ధతి ప్రకారం తెలంగాణలోనూ అమలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల బస్ ఎక్కిన మహిళలు ఆధార్ కార్డు తప్పనిసరిగా తమ దగ్గర పెట్టుకోవాలి.. బస్ దిగే వరకు టికెట్‌ని తమ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోవాలి.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరీక్షించి మార్పులు చేర్పులు చేస్తామంటూ కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది అందువల్లే రేపటి నుంచి తెలంగాణ బస్ లో ప్రయాణించి మహిళలకు ఈ ఉచిత బస్సు పథకం అమలులోకి రాబోతోంది అయితే ఇది సోనియా గాంధీ బర్తడే కానుకగా ఈ పథకం అమలులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.