వైరల్: ఒక్కరోజే 335 కరోనా కేసులు.. ఆందోళనలో ప్రజలు..!!
అయితే ప్రస్తుతం దేశంలో ఆక్టివ్ కేసుల సంఖ్య 1,701 చేరగా..ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు పైగ దాటిందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు..వీరిలో 4.46 కోట్ల మంది కోలుకోవడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల 5,33,316 మంది మరణించారని తెలియజేయడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81 శాతం చేరుకోక మరణాల రేట్లు 1.19 శాతంగా ఉందని పేర్కొంది మంత్రుత్వ శాఖ అధికారికంగా వెబ్సైట్లో తెలియజేశారు.. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్ ను అందించినట్లుగా తెలియజేశారు.
మరోవైపు కేరళలో కొత్త రకం వేరియంట్ JN -1 కేసును సైతం వైద్యులు గుర్తించారు.. శనివారమే ఈ కేసును గుర్తించడం జరిగిందట.ఇవే లక్షణాలతో ఆదివారం ఓ బాధితుడు మరణించడం జరిగిందట. అయితే JN -1 వేరియంట్ విషయంలో ఎవరు భయపడవద్దని కేరళ ఆరోగ్యం మంత్రి వీణ జార్జ్ తెలియజేయడం జరిగింది.. భారతదేశంతో పాటుగా అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో WHO సంస్థ కాస్త ఆందోళన చెందుతున్నట్లుగా తెలియజేశారు. కరోనా ప్రోటో కాల్ ను అనుసరించాలని పలు దేశాలకు సూచనలు ఇస్తున్నట్లుగా తెలియజేసింది. ఇప్పటికే పలుచోట్ల మాస్కులను ధరిస్తున్నారని అన్ని దేశాల వారు బయటకు వెళితే మాస్క్ ధరించాలని చెబుతోంది.