వైరల్:కారుతో ఓవరాక్షన్ చేస్తే ఇలానే ఉంటుంది.. వీడియో వైరల్..!!
అసలు విషయంలోకి వెళ్తే కొలరాడో స్ప్రింగ్స్లోని మాల్ వెలుపల ఉన్న పార్కింగ్ స్థలంలో ఓ యువతి SUV కారును ప్రమాదకరంగా నడపడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అది బోల్తా పడింది. అంతేకాకుండా 5 గురు యువతి యువకులు ఆ కారు డోర్ల పై వేలాడుతూ ఉండం మనం ఈ వీడియోలో చూడవచ్చు.కారును వేగంగా వెనక్కి తిప్పటంతో అది ఒక్కసారిగా పల్టీ కొట్టినట్టుగా కనిపిస్తోంది. దీంతో కారు డోర్లపై నిలుచున్నవారు కారు కింద పడి నలిగిపోయారు.
ఈ వీడియో వైరల్ కావడం చేత ఈ ఘటనకు సంబంధించి కులరాడో పోలీసులు స్పందించడం జరిగింది.. అధికారులు మాట్లాడుతూ ఈ కారు ప్రమాదానికి కారణమైన యువతిని అరెస్టు చేశామని నిర్లక్ష్య పూరితంగా డ్రైవ్ చేసినందు వల్ల ఈమె పైన కేసు నమోదు చేసినట్లు పోలీసుల సైతం తెలియజేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేసిన యువతీకి స్వల్ప గాయాలు కాగా కారు కింద పడిన వాళ్ళకి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు తెలియజేశారు..ఘటన జరిగిన వెంటనే మాల్ దగ్గర ఉన్నవారి సహాయంతో వారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని పోలీసులు సైతం తెలియజేస్తున్నారు..ఈ ప్రమాదం గత శనివారం రాత్రి జరిగినట్లుగా పోలీసులు సైతం తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఇంత రాష్ డ్రైవింగ్ చేస్తే ఇలాంటి తిప్పలు తప్పవని చెప్పవచ్చు.