న్యూ ఇయర్ రోజున కొడుకు పెళ్లి గురించి శుభవార్త చెప్పిన వైయస్ షర్మిల..!!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన చర్యలు వైయస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. షర్మిలాకు ఒక కొడుకు ఉన్న సంగతి తెలిసిందే.. షర్మిల కొడుకు పేరు వైయస్ రాజారెడ్డి..వైఎస్ షర్మిల ఇంట్లో జరగబోయే ఒక మోస్ట్ శుభకార్యం తన కొడుకు పెళ్లి అయితే తన కొడుకు పెళ్లి గురించి ఒక ప్రకటన చేసింది షర్మిల వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈనెల 18 తన కుమారుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం జరగబోతుందని వైయస్ షర్మిల ట్విట్టర్లో తెలిపారు. అలాగే ఫిబ్రవరి 17న పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఈ 2024 సంవత్సరంలో తన కోడుకు వివాహం జరగబోతోంది అంటూ ట్విట్టర్ లో తెలియజేసింది... నా కుమారుడు వైయస్ రాజారెడ్డికి ప్రియమైన అల్లూరి ప్రియతో జనవరి నెల 18న ఎంగేజ్మెంట్ జరగబోతుందని.. అలాగే ఫిబ్రవరి 17న వీరి వివాహ వేడుక గురించి మీతో  పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది అంటూ షర్మిల తెలియజేసింది.

అలాగే మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని రేపటి రోజున షర్మిల తండ్రి  వైయస్సార్ ఘాట్ నీ సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి తన తండ్రి  ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని  తెలియజేశారు..ఈ విషయం మీతో పంచుకోవడానికి తాను ఎంతో సంతోషిస్తున్నాను అంటూ ట్విట్ లో  పోస్ట్ చేసింది షర్మిల..గత కొద్ది రోజులుగా మీడియాలో షర్మిల కొడుకు  గురించి పది వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలన్నీ పుల్ స్టాప్ పెట్టే విధంగా. షర్మిల- అనిల్ దంపతుల కుమారుడు రాజారెడ్డి వివాహ తేదీని కొత్త ఏడాదిన ప్రకటించారని తెలుస్తోంది..రాజారెడ్డి ప్రియతో కలిసి ఉన్న ఫోటోలను వైయస్ షర్మిల పోస్ట్ చేశారు. అంతేకాకుండా రాజారెడ్డి ప్రియ ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. మరి వీరి వివాహానికి ఎవరెవరు వస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: