ఈ గొర్రెకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో కానీ.. ఒలంపిక్స్ పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం?
ఏకంగా ఒలంపిక్స్ లో క్రీడాకారులు చేసినట్లుగానే ఇక్కడ ఒక గొర్రె సాహసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. బయటకు వెళ్లిన గొర్రెలు వాటి మంద వద్దకు ఆలస్యంగా వస్తాయి. అయితే అప్పటికే యజమాని మిగతా గొర్రెలు అన్నింటినీ కూడా ఒకచోటకి చేర్చి ఇక గేటు వేస్తాడు. అయితే ఆలస్యంగా రావడానికి తమ యజమాని చూస్తే ఎక్కడ కొడతాడో అని ఆ గొర్రెలు భయపడతాయి.
ఎలాగైనా మిగతా గొర్రెల మందను ఉంచిన చోటుకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటాయి. అయితే ముందు భారీ కంచ కనిపించిన కూడా ఆ గొర్రెలు ఎక్కడ వెనకడుగు వేయవు. ఏకంగా సాహసం చేసి ఎంతో ఎత్తు ఉన్న కంచె పైనుంచి లోపలికి దూకుతుంది ఒక గొర్రె. అయితే ఈ సాహసాన్ని సినిమాల్లో చూసి నేర్చుకుందో లేదంటే ఒలిపిక్స్ జరుగుతున్నప్పుడు టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూసిందో గానీ ఈ గొర్రె చేసిన సాహసం చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. సినిమాల్లో ఇలాంటివి చూసాం. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటిది ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.