పెళ్లి పీటల మీదే వరుడి ముఖంపై ఉమ్మేసిన వధువు.. ఏం జరిగిందంటే?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులందరూ కూడా ఇక ఇలా వైవాహిక బంధంతో ఒక్కటవ్వడానికి సిద్ధమవుతున్నారు. కొంతమంది పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటుంటే ఇంకొంతమంది ఇక మంచి ముహూర్తం చేసుకుని ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే పెళ్లి విషయంలో అందరూ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకొని వధూవరుల వేషధారణ, వారి ప్రవేశం, ఇక మండపం అలంకరణ అనే విషయంలో ఇక ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు.



 అయితే పెళ్లి వేడుక సమయంలో వధూవరులు ఇద్దరు కూడా ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడటం చేస్తూ ఉంటారు. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు స్వీట్లు ఒకరికి ఒకరు తినిపించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ పెళ్లిళ్లలో సర్వసాధారణం. కానీ కొన్ని పెళ్లిళ్లలో మాత్రం చిత్ర విచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ లోకి వచ్చి చక్కర్లు కొడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఏకంగా పెళ్లి పీటల మీదే వరుడుతో గొడవ పడిన వధువు అతని మొఖం మీదే ఉమ్మేసింది.


 సాధారణంగా పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు సిగ్గు బిడియంతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వధువు ఏకంగా కాళికాదేవి రూపాన్ని ప్రదర్శించింది. అది కూడా ఒక చిన్న కారణానికి. పెళ్లి వేడుకలో ముందు వధువు వరుడుకి రసగుల్లా తినిపించింది. అయితే ఆ తర్వాత వరుడు కూడా వధువుకి రసగుల్లా తినిపించేందుకు ప్రయత్నించగా వధువు మాత్రం నో చెప్పింది. దీంతో వరుడు బలవంతంగా రసగుల్లాను ఆమె నోట్లో పెట్టడానికి ప్రయత్నించాడు. దీంతో చిర్రేత్తుకొచ్చిన వధువు అతన్ని ఒక తోపు తోయడంతో కళ్యాణ మండపం నుంచి కిందికి పడతాడు.  ఇక ఆ తర్వాత తిట్ల దండకం అందుకొని వరుడుని కాళ్లతో తంతు కొడుతూ రెచ్చిపోతుంది. అంతేకాదు ఏకంగా వరుడు ముఖం మీద ఉమ్మి వేస్తుంది  అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: