బ్రో అసలు నీకు భయం లేదా.. ఏం చేశాడో చూడండి?

praveen
పాము.. ఈ పేరు వినిపించింది అంటే చాలు తెలియకుండానే భయం పుడుతూ ఉంటుంది. ఇక పాము మన వైపుగా వచ్చింది అంటే చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అవుతూ ఉంటుంది. కళ్ళ ముందు ఉంది ప్రమాదకరమైన పాము అని తెలిస్తే ఇంకేముంది వామ్మో అక్కడి నుంచి పరుగో పరుగు అంటారు అందరూ. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం పాములను ఎంతో కూల్ గా హ్యాండిల్ చేస్తారు. ప్రమాదకరమైన పాములతో కూడా స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు ఒక యువకుడు ఇలాగే పామును చూసి ప్రవర్తించిన తీరు ఇంటర్నెట్లో అందరిని ఆశీర్వదించింది.

సాదరణంగానే ఆస్ట్రేలియా ప్రజలు ప్రకృతికి ఎంత ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడవులు వన్య మృగాల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఇక వాటికి హాని కలిగించడానికి కూడా ఇష్టపడరు అని చెప్పాలి. ఇక ఇలా వన్యప్రాణుల పట్ల వారు ప్రవర్తించే తీరే వారు ఇక ప్రకృతికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉంటుంది.

 ఇక్కడ ఒక యువకుడు ఇలాంటిదే చేసాడు. మిల్లర్ విల్సన్ అనే యువకుడు సరస్సు పక్కన ఉన్న ఒక రాయిపై కూర్చొని తన కాళ్ళను నీళ్లలో ఉంచి గిటార్ వాయిస్తూ.. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో నీటిలో నుండి ఒక పాము అతని దగ్గరికి ఈదుతూ వచ్చింది. భారీ ఆకారంలో ఉన్న ఆ పామును చూసి అతను కాస్తయినా భయపడలేదు. ఏకంగా కొన్ని సెకండ్ల పాటు అది అక్కడే ఉంది. అలా ఆ పాము దగ్గరికి వస్తుంటే ఎవరైనా సరే భయపడి అక్కడ నుంచి పరుగులు పెడతారూ. కానీ మిల్లర్ మాత్రం భయపడటానికి బదులు ఎంతో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. దీంతో ఈ వీడియో చూసి నీకు భయం లేదా బ్రో అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: