ఈ ప్రపంచంలో చాలా రకాల వింతలున్నాయి.ఇంకా అలాగే మరెన్నో విశేషాలున్నాయి..అయితే గతంలో వీటి గురించి అంతగా తెలిసేది కాదు.ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త వింతలు వెలుగులోకి వస్తున్నాయి.వాటి గురించి తెలుసుకున్న తర్వాత మనం ఆశ్చర్య పోవడం పక్కా. అయితే ఇందులో కొన్ని ఆచారాలు వింతగా ఉంటే.. మరికొన్ని ఆచారాలు మాత్రం ఎబ్బెట్టు కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి ఆచారం ఒకటి మన దేశంలో ఉంది. అది ఈమ్మధ్యనే వెలుగులోకి వచ్చింది.. ఇంతకీ అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే ఆ ఆచారం గురించి మీరు విన్న తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. అసలు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో సోషల్ మీడియాలో వెతుకుతుంటారు. లేదా గూగుల్ సెర్చ్ చేస్తారు. ఇంతకీ ఆ ప్రాంతం మరెక్కడో కాదు.. హిమాలయాలకు దగ్గరలో ఉన్న అందమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.. ఈ రాష్ట్రంలోని కులు జిల్లాలో పిని అనే ఓ ఊరు ఉంది.
ఈ గ్రామంలో మహిళలు ఏడాదిలో ఐదు రోజుల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపిస్తారట. వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయాన్ని ఆ మహిళలు పాటిస్తున్నారు. పైగా ఇది వారి తరతరాల ఆచారమని ఆ మహిళలు చెబుతున్నారు. ఇలా నగ్నంగా ఉంటే ప్రకృతికి గౌరవం ఇచ్చినట్టు అని వారు భావిస్తారట.. వారి ఆరాధ్య దైవానికి ఆ మహిళలు నగ్నంగానే పూజలు చేస్తారట. అయితే ఇలా నగ్నంగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలిని, పరిశుద్ధమైన సూర్య కాంతిని, సహజ వాతావరణాన్ని ఆలింగనం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వారు నమ్ముతారు. పైగా దీనివల్ల భౌతిక శక్తులు కూడా తమ శరీరానికి మంచి చేస్తాయట. ఎలాంటి వ్యాధులు, ఇతర రుగ్మతలు దరి చేరవట.ఇంకా అంతేగాక శరీరం మరింత రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుందట..ఇంకా అలాగే నగ్నంగా ఉంటే భౌతిక పరమైన కోరికలపై కూడా వారికి అదుపు ఉంటుందట. ఆ గ్రామం మొత్తం మహిళలు ఇలానే చేస్తారట.